పార్లమెంట్ సమావేశాలు.. ఎన్ని గంటలు వృథా అంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. కరోన పరిస్థితులతో పాటు అజెండాలో చర్చించాల్సిన అంశాలు పూర్తయిన నేపథ్యంలో ఒకరోజు ముందే సమావేశాలను ముగించారు. నవంబర్ 29న ప్రారంభమైన సమావేశాలు షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 23 వరకు జరగాలి. కానీ డిసెంబర్ 22న ముగించారు. ఎంపీల నిరసనల కారణంగా శీతాకాల సమావేశాల్లో 18 గంటలు వృథా అయినట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. అదే విధంగా రాజ్యసభను కూడా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.