NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్ల‌మెంట్ స‌మావేశాలు.. నేటి నుంచే ప్రారంభం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో మొత్తం 24 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ఈ సమావేశాల్లోనే నిర్వహించనున్నారు. సమావేశాల తొలిరోజే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అలాగే, ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహిస్తారు. మరోవైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిపథ్‌ పథకం తదితర అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తనున్నాయి. చమురు, గ్యాస్‌ ధరలు, అగ్నిపథ్‌, రూపాయి విలువ పతనం, సరిహద్దుల్లో చైనాతో పెరిగిన ఉద్రిక్తతలు, ప్రతిపక్షాలను బలహీనం చేసేందుకు ఈడీ, సీబీఐ దాడులు, ప్రజాస్వామ్యం గొంతునొక్కే చర్యలపై ఈ సమావేశాల్లో తీవ్ర నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలు సంఘటితమవుతున్నాయి.

                                           

About Author