ఆందోళనకారుల ఆధీనంలో పార్లమెంట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇరాక్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన తొలగిపోలేదు. అక్టోబరులో ఎన్నికలు జరిగినా స్పష్టమైన మెజార్టీ లేక 10 నెలలైనా ప్రభుత్వం ఏర్పాటు కాకవడంపై జరుగుతున్న ఆందోళనలు శనివారం మరో స్థాయికి చేరాయి. కొత్త ప్రధానిని ఎన్నుకోకుండా ప్రముఖ షియా మత వర్గ నాయకుడు ముక్తబా అల్ సదర్ అనుచరులు పార్లమెంటు ను ముట్టడించారు. వేలాది మంది పార్లమెంటు భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. తమ డిమాండ్లను ఆమోదించే వరకు కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 125 మంది గాయపడ్డారు. ఇందులో 25 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు, సౌండ్ బాంబులను ప్రయోగించారు. అయితే పార్లమెంటు భవనంలోకి పెద్ద సంఖ్యలో జనం రావడంతో పోలీసులు కూడా వెనక్కి తగ్గారు.