శోభా యాత్రలో పాల్గొని విజయవంతం చేయండి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం ఉదయం కర్నూలు నగరంలోని స్థానిక శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం వినాయక ఘాట్ నందు విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో 12-4-25 శనివారం నిర్వహించబోయే శ్రీ వీర హనుమాన్ విజయ శోభా యాత్ర ను ఉద్దేశించి ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి. మద్దిలేటి, కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ లక్కి రెడ్డి అమరసింహా రెడ్డి రాష్ట్ర నాయకులు శ్రీ తూముకుంట ప్రతాప్ రెడ్డి కర్నూలు నగరం మరియు కర్నూలు జిల్లా చుట్టు ప్రక్కన నివసించే అన్ని గ్రామాలలో ఉండే భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ నాయకులు, ముఖ్యంగా యువకులు ఈ శోభా యాత్రలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా కార్యదర్శి ఈపూరి నాగరాజు , విభాగ్ అధికారి శ్రీ నీలి నరసింహ విశేష సంపర్క ప్రముఖ్ విభాగం, బజరంగ్ దళ్ విభాగ్ కన్వీనర్ మీనుగ రాజేష్ , కర్నూలు జిల్లా కన్వీనర్ వెలగల సాయిరాం , బజరంగ్ దళ్ జిల్లా టోలి సభ్యులు మండ్ల హరికృష్ణ, గుజరాతి సురేష్, చమిరాజు శివ సాయినాథ్, పరశురామ్, గుంపిలి భాస్కర్, రాంబాబు , యశ్వంత్ నాధ్, జెపి జయప్రకాశ్ సింగ్, బళ్లారి తేజ, ఉపేంద్ర నాయక్, జంపాల నవీన్ తదితరులు పాల్గొన్నారు.