PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘బిఎస్ఎన్ఎల్’ సిటీ ఆన్లైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ తో భాగస్వామ్యం

1 min read

– ఎంటర్టర్మెంట్ అనేది జీవితంలో ఒక భాగం.. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఉమ్మడి పశ్చిమ గోగవారి జిల్లాలో తొలిసారిగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( బీఎస్ఎన్ఎల్ ) ఐపీటీవీ సర్వీస్ ప్రారంభించడం అభినందనీయమని జిల్లా ఎస్ పి రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. స్థానిక స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శ్రుక్రవారం బీఎస్ఎన్ఎల్, సిటీ ఆన్ లైన్ మీడియా ప్రవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఐపీటీవీ సర్వీస్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్ పి రాహుల్ దేవ్ శర్మ పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాని నిర్వహించారు. అనంతరం ఐపీటీవీ సర్వీస్ ను జిల్లా ఎస్ పి రాహుల్ దేవ్ శర్మ ఆవిష్కరించారు. ఈసందర్భంగా జిల్లా ఎస్ పి మాట్లాడుతూ ఎంటటైన్మెంటనేది జీవితంలో ఒక బాగమన్నారు. ప్రభుత్వ రంగానికి చెందిన టెలికం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( బీఎస్ఎన్ఎల్) కస్టమర్లకు సిటీ ఆన్‌లైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యంగా ఏర్పడి ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) సర్వీసులు అందించడం అబినందనీయమన్నారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బ్రాడ్‌బాండ్ కస్టమర్లకు ఈ సేవలు అందుబాటులో వున్నాయన్నారు. సిటీ ఆన్‌లైన్ మీడియాకు చెందిన ఉల్కా టీవీ బ్రాండ్ కింద ఈ సర్వీసులు అందుబాటులోనికి బీఎస్ఎన్ఎల్ తీసుకొనివచ్చిందన్నారు. బీఎస్ఎన్ఎల్ బ్రాండ్ బాండ్ కనెక్షన్‌తో పాటు ఈ సేవలు పొందొచ్చునన్నారు. దీని వల్ల కస్టమర్లు టీవీకి, బ్రాడ్‌బాండ్‌కు విడివిడిగా కనెక్షన్లు తీసుకోవాల్సిన పని లేదన్నారు. తదుపరి బీఎస్ఎన్ఎల్ ఏలూరు బిజినెస్ ఏరియా జిఎమ్ ఎల్. శ్రీను మాట్లాడుతూ ఉమ్మడి పచ్చిమగోదావరి జిల్లాలలో ఈ సర్వీస్ అందిబాటులోనికి తీసుకొనివచ్చామన్నారు. వాటిలో నాలుగు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయన్నారు. స్టాండర్డ్ డెఫినేషన్ బేసిక్, స్టాండర్డ్ డెఫినేషన్ బొనాంజా, హై డెఫినేషన్ బేసిక్, హై డెఫినేషన్ బొనాంజా అనేవి ప్రస్తుతం అందుబాటులో వున్నాయన్నారు. వీటి ధర వరుసగా రూ. 229, రూ. 259, రూ. 279, రూ.329గా ఉందన్నారు. డిజిటల్ టెలివిజన్ ఛానల్స్ పై రోజు రోజు కు పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా ఉల్కా టీవీ బ్రాండ్ కింద ఈ సర్వీసులు అందుబాటులోనికి బీఎస్ఎన్ఎల్ తీసుకొనివచ్చిందన్నారు. బీఎస్ఎన్ఎల్ ఏలూరు బిజినెస్ ఏరియాలో 16వేల ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు ఉన్నారన్నారు. ఈ ఐపీటీవీ లో 4కె టెక్నాలజీ కలిగి వుండడంవలన అత్యుతమ క్వాలిటీ తో వీక్షించవచ్చునన్నారు. అనంతరం ఉల్కా టీవీ డైరెక్టర్ రాఘవరావు మాట్లాడుతూ ఉల్కా టీవీ అనేది లేటెస్ట్ 4కే టెక్నాలజీ హై ఎఫిసియెన్సీ వీడియో కోడింగ్ ద్వారా కస్టమర్లకు బెస్ట్ క్వాలిటీ సర్వీసులు అందిస్తోందన్నారు. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ కస్టమర్లు ఇకపై ఐపిటీవీ సర్వీసులు పొందొచ్చునన్నారు. ఐపీటీవీ సర్వీసులు 4కె టెక్నాలజీతో ప్రజలకు అందుబాటులోనికి తీసుకొనివచ్చామన్నారు. ఈ సేవలు శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా కాకుండా ఫైబర్ ద్వారా లభిస్తాయన్నారు. టీవీ ఛానల్స్‌ను టీవీలోనూ, స్మార్ట్‌ఫోన్‌లోనూ రెండింటిలోనూ చూడొచ్చునాన్నారు. అలాగే ఉల్కా టీవీ ప్రత్యేకమైన యాప్ కూడా ఉందన్నారు. కస్టమర్లు ఓటీటీ అప్లికేషన్స్, లైవ్ శాటిలైట్ టీవీ ఛానల్స్ చూడొచ్చునన్నారు. ఈసమావేశంలో డిజిఎం సోమయాజులు, ఐఎఫ్ఏ శ్రీరామ్ మూర్తి, బీఎస్ఎన్ఎల్ పిఆర్ఓ మోహన్ కృష్ణ, లతోపాటు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

About Author