పేటీఎంతో భాగస్వామ్యం…ప్రచారాన్ని ప్రారంభించిన అక్షయ్ కుమార్
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: పండుగ సీజన్ సమీపించిన వేళ , స్టింగ్ ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ చెల్లింపులు మరియు ఆర్ధిక సేవల కంపెనీ , క్యుఆర్ మరియు మొబైల్ చెల్లింపులలో అగ్రగామి , పేటీఎంతో భాగస్వామ్యం చేసుకుని తమ వినియోగదారులకు అత్యంత ఉత్సాహపూరితమైన మరియు నగదుకు తగ్గ విలువ ఆఫరింగ్ను అందించనున్నట్లు వెల్లడించింది . ఇది వారి పండుగ వేడుకలకు మరింత శక్తిని అందించే రీతిలో ఉంటుంది . ప్రతి స్టింగ్ 250 మిల్లీ లీటర్ల పెట్ బాటిల్ కొనుగోలుతో వినియోగదారులు తమ మొట్టమొదటి పేటీఎం యుపీఐ లావాదేవీపై 40 రూపాయల క్యాష్ బ్యాక్ పొందవచ్చు . ఈ ఆఫర్ను స్టింగ్ బాటిల్పై ఉన్న పేటీఎం యొక్క క్యుఆర్ కోడ్ఈ ఆఫర్ మరియు టీవీసీ గురించి పెప్సీకో ఇండియా సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ , ఎనర్జీ , హైడ్రేషన్ , ఫ్లేవర్స్ నసీబ్ పురి మాట్లాడుతూ ” పండుగ సంతోషాన్ని రెట్టింపు చేసే రీతిలో గతంలో ఎన్నడూ చూడని ఆఫరింగ్ను అందించడం కోసం పేటీఎంతో చేతులు కలపడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము . గతంలో ఎన్నడూ ఎవరూ చేయని అంశాలను చేస్తుందని స్టింగ్కు గుర్తింపు ఉంది . మేము చేసే ప్రతి పనిలోనూ అది ప్రతిబింబిస్తుంది . ఈ ప్రచారం ద్వారా మేము ఆ సిద్ధాంతం కొనసాగించడం మాత్రమే కాదు , వినియోగదారులు తమ మొదటి పేటీఎం యుపీఐ లావాదేవీ నిర్వహించిన ఎడల స్టింగ్ పెట్ బాటిల్ ధరకు రెట్టింపు మొత్తంను క్యాష్బ్యాక్గా అందిస్తున్నాము . ఈ ఆఫర్ మా వినియోగదారులకు తమ మొదటి యుపీఐ లావాదేవీ ద్వారా ఖచ్చితమైన క్యాష్బ్యాక్ను అందిస్తుంది . ఈ ఆఫర్ పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము మరియు ఈ పండుగ సీజన్లో ఇది మరింత ఉత్సాహం తీసుకువస్తుందని ఆశిస్తున్నాము ” అని అన్నారు .