బీసీల పార్టీ..టీడీపీ..
1 min readమంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి
మంత్రాలయం, పల్లెవెలుగు: బడుగు బలహీన వర్గాల కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ లో బిసిలకు ప్రముఖ స్థానం ఇవ్వడం జరుగుతుందని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో జయహో బీసీ కార్యక్రమం టిడిపి మండల కన్వీనర్ పన్నగ వెంకటేష్ అద్యకతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని అన్నారు. బీసీలకు స్థానిక సంస్థలను 36 శాతం రిజర్వేషన్లు పెంచి, బీసీ సబ్ ప్లాన్లు ఆదరణ పథకాల ద్వారా 40,803 కోట్ల కేటాయించిన ఘనత తెలుగుదేశం పార్టీదే అన్నారు. ఇప్పటివరకు దాదాపు కోటి 51 లక్షల మంది లబ్ధిదారులు బీసీ సబ్ ప్లాన్ ల ద్వారా ప్రయోజనం పొందినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యాసరాజ్ స్వామి, గోపాల్ స్వామి, జనసేన పార్టీ ఇన్చార్జ్ బి లక్ష్మన్న, బీసీ సెల్ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చావిడి వెంకటేష్, ఎల్లారెడ్డి,అశోక్ రెడ్డి, విజయరామరెడ్డి, బూదుర్ మల్లికార్జున్ రెడ్డి, గోపాల్ రెడ్డి,పవన్ కుమార్, ఎంపిటిసి వెంకటేష్, సూగురు భాస్కర్ రెడ్డి, చిలకల డోన హనుమంతు, కళ్ళు దేవకుంట భీమయ్య, వట్టప్ప గారి నరసింహులు, ఏబు, శివ,మేకల నరసింహులు, రామకృష్ణ,కేశన్న, తిక్క స్వామి గౌడ్,లక్ష్మయ్య, రవికుమార్,మాలపల్లి చంద్ర, అబ్దుల్, పవన్ కుమార్, బండ్రాల నరసింహులు, జెట్టి వీరేష్, మజ్జిగ బొజ్జప్ప, దబ్బల రోగెప్ప, బండ్రాల మల్లి,మజ్జిగ నాగేంద్ర, నారాయణ,కురువ మల్లయ్య,నాగన్న, సజ్ఞనం,తిక్కయ్య, దత్తు, ఈరన్న,రంగన్న ఐ టి డి పి సభ్యులు చిదానంద,లింగప్ప తదితరులు పాల్గొన్నారు.