పరుచూరి వెంకటేశ్వరరావు ఎందుకు అలా అయ్యారంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావుకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అయింది. దర్శకుడు జయంత్ సి. పరాన్జీ సరదాగా ఆయన్ను కలిసిన సందర్భంలో దిగిన ఫొటోనే షేర్ చేశారు. ఆ ఫొటోలో పరుచూరి వెంకటేశ్వరరావు బక్కచిక్కిపోయినట్లు కనిపిండడంతో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని వార్తలు హల్చల్ చేశాయి. దీనిపై ఆయన సోదరుడు పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు ఛానెల్ ద్వారా ఓ వీడియో షేర్ చేసి ఆయన ఎందుకు అలా ఉన్నారో వివరించారు. ‘‘2017లో ఆస్ట్రేలియా వెళ్లి వచ్చాక అన్నయ్యలో కొంత తేడా వచ్చింది. ఆరోగ్య పరీక్షలు చేయిస్తే ఆహార నియమాలు మార్చుకోవాలన్నారు. అవి పాటించడం వల్ల ఆయన 10 కిలోలు తగ్గారు. జుట్టుకు రంగు వేయకపోయేసరికి అలా ఉన్నాడు. 70 కేజీల వ్యక్తి 10 కేజీలు తగ్గే సరికి బక్కచిక్కినట్లు కనిపిస్తున్నారు. కానీ ఆయన మేదస్సు, రచనలో పట్టు అలాగే ఉంది. ఆ ఫొటో షేర్ చేసిన జయంత్‌ను ఎందుకయ్యా అలాంటి ఫొటో పెట్టావు అనడిగాను. “ అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.