పాస్టర్ పగడాల ప్రవీణ్ ది ముమ్మాటికి హత్య
1 min read
హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించడం అన్యాయం
ఏపీ సీఎం చంద్రబాబు దర్యాప్తు వేగవంతం చేసి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి
క్రైస్తవులకు,పాస్టర్లకు రక్షణ కల్పించాలని భారీ సంఖ్యలో క్రైస్తవ సంఘాలు క్యాండిల్ ర్యాలీ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పగడాల ప్రవీణ్ ది ముమ్మాటికి హత్య బ్రదర్ పగడాల ప్రవీణ్ కుమార్ యాక్సిడెంట్ గా చిత్రీకరించడం దుర్మార్గం ఆయన మిస్టరీ మర్డర్ పై సమర్థవంతమైన విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు డిమాండ్ చేశారు. కొవ్వూరు టోల్గేట్ దాటేటప్పుడు సిజి ఫుటేజ్ లో బ్రదర్ పగడాల ప్రవీణ్ బాగానే ఉన్నారని టోల్గేట్ దాటిన తర్వాత మిస్టరీగా యాక్సిడెంట్ జరగటం, యాక్సిడెంట్గా చిత్రీకరించడం దుర్మార్గమని బాధాకరమని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు మరియు క్రైస్తవ సంఘాలు భారీ సంఖ్యలో క్రైస్తవులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించి దర్యాప్తును వేగవంతం చేయాలని ఇటీవల క్రైస్తవులపై దళితులపై చర్చలపై మహిళలపై దాడులు దౌర్జన్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని, క్రైస్తవులకు రక్షణ కల్పించాలని మత స్వేచ్ఛ, హక్కుల రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. పగడాల ప్రవీణ్ అంతర్జాతీయ సువార్తికునిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని పెరికె తెలిపారు.పగడాల ప్రవీణ్ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం క్యాండిల్స్ వెలిగించి డాక్టర్ పగడాల ప్రవీణ్ చిత్రపటానికి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు, క్రైస్తవులు, మహిళలు, పాస్టర్లు స్వచ్ఛంద సేవకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
