పాతాళగంగ ..శివగంగ జలప్రసాద ప్లాంట్ల పరిశీలన
1 min readపల్లెవెలుగు, వెబ్, శ్రీశైలం: శ్రీశైలం మహా క్షేత్రంలో కార్తీక మహోత్సవంలో భాగంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన శివగంగ జలప్రసాద ప్లాంట్లను శ్రీశైల క్షేత్ర పరిధిలో ఉన్న ప్లాంట్లను ఈవో లవన్న పరిశీలించారు. నీటి ప్లాంట్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలని, అధికారులను సూచించాడుపుణ్య స్థానాలు ఆచరించేటప్పుడు భక్తులకు ప్రమాదాలు జరగకుండా గజ ఈతగానులను ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు తెలిసే విధంగా పాతాళగంగలో సూచికబోర్డులను ఏర్పాటు చెయ్యనున్నారు.కార్తీకమాసంలో భక్తులు అధికసంఖ్యలో పాతాళగంగలో పుణ్యస్నానాలాచరిస్తారని అన్నారు. పాతాళగంగ పరిసరాలను, పాతాళగంగ మెట్లను మరియు, మెట్ల వెంబడి ఉన్న విద్యుత్ దీపాలను విద్యుదీకరణ చేయాలన్నారు మెట్ల మార్గాన్ని కూడా పరిశీలించాడుఎప్పటికప్పుడు మెట్ల మార్గాన్ని శుభ్రత చేస్తున్నారని ఆయా శాఖకు ఆదేశించాడుహేమారెడ్డి మల్లమ్మ ఆలయం వద్ద ఫ్లోరింగ్ పనులను పరిశీలిస్తూ పనులన్ని నాణ్యతా ప్రమాణాలతో ఉండాలని తెలిపారు.శౌచాలయాలను నిరంతరం పరిశుభ్రంగా ఉండేవిధంగా నిర్వహిస్తుండాలని కూడా పారిశుద్ధ్య విభాగానికి ఆదేశించాడు.