సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన పత్తికొండ ఎమ్మెల్యే
1 min read
పత్తికొండ , న్యూస్ నేడు: పత్తికొండ నియోజకవర్గం 20 మంది బాధితులకు సీఎం సహాయ నిధి కింద పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాం కుమార్ చెప్పులను పంపిణీ చేశారు. పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్. పత్తికొండ నియోజకవర్గంలోని 20 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 29 లక్షల 44,649 రూపాయలు మంజూరు కాగా అందుకు సంబంధించిన చెక్కులనుపత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ స్థానిక టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే.ఈ .శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, కష్టకాలంలో కుటుంబానికి పెద్దకొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్నారని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.పత్తికొండ మండలం పందికోన గ్రామానికి చెందిన కొత్తపల్లి సుంకులమ్మ కు 1,00,000 రూపాయల విలువగల చెక్కునుపత్తికొండ మండలం పత్తికొండ పట్టణానికి చెందిన హేమంత్ కుమార్ రూ.156763 లు,పత్తికొండ మండలం హోసురు గ్రామానికి మాల లక్ష్మన్న రూ. 265927 లు,పత్తికొండ మండలం పత్తికొండ టౌన్ గజ్జల రఘువీర పవన్ కు రూ. 72916 లు, పత్తికొండ మండలం నలకదొడ్డి గ్రామానికి చెందిన మాదిగ ఆంజనేయులుకు రూ. 126941 లు, పత్తికొండ పట్టణానికి చెందిన దూదేకుల నజీర్ కు రూ. 40000 లు, వెల్దుర్తి మండలం రత్నపల్లి గ్రామానికి చెందిన గుడ్ల కంటి చిన్న వెంకటేశ్వర్లుకు రూ.77144లు,వెల్దుర్తి మండలం కల్లుగొట్ల గ్రామానికి చెందిన పుట్టక కిరణ్ కు రూ.75225లు, వెల్దుర్తి కి చెందిన బి. సత్యనారాయణకు రూ. 42114 లు, మద్దతు.

