గ్రామ స్వరాజ్యానికి బాటలు జగనన్న నవరత్నాలు.. ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందిస్తున్నామని పెసరవెయ్ గ్రామంలో మంగళవారం నాడు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు అందిన నవరత్నాల బుక్ లెట్ ను గడప గడపకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజాధరణ పొందుతున్నదని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు గ్రామ స్వరాజ్యానికి బాటలు వంద శాతం మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేశామన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ సంక్షేమ పథకాలైన నవరత్నాలు తదితర అంశాలు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో జగన్ పై ఆదరణ పెరిగిందని వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 నినాదం తో పూర్తిస్థాయిలో అధికారంలో వస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి కోసం నాడు నేడు కార్యక్రమం అనేక రకాలైన హామీలను నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు అనంతరం పెసరవెయ్ గ్రామానికి చెందిన టిడిపి కుటుంబాలు వైసిపి విధానాలు నచ్చి. శ్రీకాంత్ రెడ్డి స్వగృహం వద్ద ఎమ్మెల్యే సమక్షంలో దాదాపు 150 మంది వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ఎంపీపీ నాగమద్దమ్మ జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి. వైసిపి మండల అధ్యక్షుడు శివరామిరెడ్డి. ఎల్లారెడ్డి. శ్రీకాంత్ రెడ్డి. రాజారెడ్డి. వైద్యుడు మంచాల నిరంజన్ రెడ్డి. సిరుప శ్రీనివాసరెడ్డి.. రఘు మాధవరెడ్డి. బాల చేన్ని. సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి. ఆర్ బి కే పుల్లయ్య. వెంకట కృష్ణారెడ్డి. బండపల్లి రమేష్ . . మండల స్థాయి వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.