సత్యం పలకడమే దేశభక్తి !
1 min read
పల్లెవెలుగువెబ్ : బ్రిటిష్ కాలంనాటి రాజద్రోహ చట్టం అమలును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం ట్విటర్ వేదికగా స్పందించారు. సత్యం పలకడం దేశభక్తి అవుతుందని, రాజద్రోహం కాబోదని చెప్పారు. సత్యాన్ని వినడం కర్తవ్యమని, దానిని అణచివేయడం దురహంకారమని పేర్కొన్నారు. భయపడొద్దని ప్రజలను రాహుల్ కోరారు.