రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన
1 min read
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: నగరంలోని 24వవార్డు లక్ష్మి నగర్ లోని కె.సి.కెనాల్ బండ్ మీద ఉన్న ఇంటి నంబర్ 49/2/c4 నుంచి సి.ఎస్.ఐ చర్చి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు నగర మేయర్ బీవై రామయ్య, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్. రూ.35 లక్షలతో చేపట్టే రోడ్డు విస్తరణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ, అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, ఎస్ఈ సురేంద్రబాబు, డిఈ రవిప్రకాష్ నాయుడు, ఏఈ హిమబిందు ఉన్నారు.