స్మశానానికి దారి ఏర్పాటు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు పెన్నా నది పరిధిలోని స్మశాన వాటికకు దారి ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ తెలిపారు, బుధవారం ఆయన చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, చెన్నూరు, బుడ్డాయి పల్లె, అరుంధతి నగర్ , కొత్త గాంధీనగర్, సరస్వతి నగర్, లక్ష్మీ నగర్, శ్రీరామ్ నగర్, కు చెందిన ప్రజలకు స్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు, నేషనల్ హైవే నుండి ప్రజలు దహన సంస్కారాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, దీనిని గుర్తించి చెన్నూరు పెట్రోల్ బంక్ వద్దనుండి, జాతీయ రహదారి పక్కనుండి పెన్నా నదిలోకి వెళ్లేందుకు రహదారికి సంబంధించి, మండల సర్వేయర్ చేత రోడ్డుకు సంబంధించి సర్వే చేసి ఎస్టిమేషన్ వేయించడం జరిగింది అన్నారు, దీనికి సంబంధించిన పనులు వేగవంతంగా జరిగేందుకు కృషి చేస్తామని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సర్వేయర్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.