పవన్ రాజకీయ వ్యభిచారి !
1 min read
పల్లెవెలుగువెబ్ : చంద్రబాబు, పవన్ పొత్తు వలన తమకొచ్చే ఇబ్బంది ఏమీ లేదని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ‘‘పవన్ కల్యాణ్ రాజకీయ వ్యభిచారి. బీజేపీ పంచన ఉంటూ చంద్రబాబుకు సిగ్నల్ ఇచ్చేవాడిని ఇంకేం అంటారు?. పవన్ అన్నట్టుగానే రాష్ట్రంలో అద్భుతం జరగబోతోంది. ఆ అద్భుతం వైఎస్సార్‌సీపీ 151పైగా సీట్లలో గెలవటమే. అంతే తప్ప పవన్ ఊహించుకునేదేమీ జరగదు. చంద్రబాబు, పవన్ ఇవాళ కలిసేదేముందీ?. మొదటనుంచి వారి మధ్య అక్రమ పొత్తులు కొనసాగుతున్నాయి. వారి పొత్తుల వలన మాకు వచ్చే ఇబ్బందిఏమీ ఉండదు“ అని జోగి రమేష్ అన్నారు.