పవన్ కళ్యాణ్ చంద్రబాబు బినామీ !
1 min read
పల్లెవెలుగువెబ్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి శంకర్ నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు బినామీల్లో పవన్ కల్యాణ్ ఒకడు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. సినిమా షూటింగ్‌లు లేనప్పుడు పవన్ రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు పవన్‌కు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. పవన్ పరామర్శించిన రైతులకు ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సాయం చేసిందని తెలిపారు. రైతుల కోసమే వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారని తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అర్థరహితమని, ఆయనకు వ్యవసాయంపై అవగాహన లేదని మండిపడ్డారు.