NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పవన్​కళ్యాణ్​ ఒక సన్నాసి – ఏపీ మంత్రి శంకర్​నారాయణ

1 min read

పల్లెవెలుగువెబ్​, కర్నూలు: పవన్​కళ్యాణ్​ ఒక సన్నాసి అంటూ ఏపీ ఆర్​అండ్​బీ మంత్రి శంకర్​నారాయణ జనసేన అధినేతపై తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం శ్రీశైలమల్లన్నను దర్శించుకున్న మంత్రి శంకర్​నారాయణ మీడియాతో మాట్లాడారు. పవన్​కళ్యాణ్​ గురించి ప్రస్తావిస్తూ నేను ప్రశ్నించేవాడినంటూ టిడిపి, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలో పొత్తులు పెట్టుకుంటూ 2014నుంచి 2019వరకు ఎక్కడ తొంగున్నాడోనని, నాటి ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చనప్పుడు ప్రశ్నించకుండా ఎక్కడ నిద్రపోయాడో ఆయనకే తెలియాలన్నారు. సాధారణంగా ఎవరైనా ఒక రాజకీయపార్టీ స్థాపిస్తే తాము అధికారంలోకి రావాలని కోరుకుంటారని, అయితే అలాంటి ఆలోచన పవన్​కళ్యాణ్​కు ఉన్న దాఖలాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో ఎలాంటి వివక్ష, అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు ప్రజల ఇళ్లకే చేరుతుండడంతో సంతోషంగా జీవిస్తుంటే టిడిపి, పవన్​కళ్యాణ్​కు నిద్రపట్టడం లేదన్నారు. పవన్​కళ్యాణ్​ తానేదో అయిపోవాలన్న ఆలోచనలో బుద్దిలేని మాటలు, తెలివిలేని మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. టిడిపి చేష్టాలు, పవన్​కళ్యాణ్​ మాటలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వం వైపుఉన్నారడనానికి ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసిన పవన్​కళ్యాణ్​ను ప్రజలు తీరస్కరించినా… ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడడం తుగునా..అని మంత్రి ప్రశ్నించారు.

About Author