పవన్ కళ్యాణ్ ఓ వ్యసనం
1 min read
పవన్ కళ్యాణ్ ఓ వ్యసనం. అలవాటైతే వదల్లేం. ఈ సినిమా గురించి మాట్లాడమని పిలిచారు. ఒక ఐపీఎస్ దగ్గరక వెళ్లి పదో తరగతి బాగా చదివారు అంటే ఎలా ఉంటుందో .. పవన్ నటన గురించి మాట్లాడితే అలాగ ఉంటుంది’ అని అన్నారు నిర్మాత బండ్ల గణేష్. ఆయన చూడని ఇండస్ట్రీ హిట్లా? బ్లాక్ బస్టర్లా? అంటూ బండ్ల గణేష్ ఆద్యంతం ఆసక్తికరంగా మాట్లాడారు. ఆయన మాటలకు స్టేజ్ మొత్తం ఈలలు, కేకలతో దద్దిరిల్లిపోయింది. చాలా మంది పుడతారు. చనిపోతారు. కొందరే చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. ఒక వైపు రోజుకు 18 గంటలు పని చేస్తూ.. మరోవైపు రాజకీయాల్లో సేవ చేస్తున్నారని అన్నారు. ఎన్నో వందల మందికి పవన్ కళ్యాణ్ ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. తాను పవన్ కళ్యాణ్ భక్తుడినని అన్నారు.