భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ
1 min read
పల్లెవెలుగువెబ్ : రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేస్తారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ భీమవరం నుంచే రాష్ట్ర రాజకీయాలకు అడుగులు పడనున్నాయన్నారు. పవన్ తరపున నియోజకవర్గ ప్రజలకు తాము అందుబాటులో ఉంటామన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషించనుందని, ఈ నెల 17న పవన్ కళ్యాణ్ భీమవరం జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.