NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భ‌ర్త‌కు పాద‌పూజ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హీరోయిన్‌ ప్రణీత సుబాష్‌ కొద్దిరోజుల క్రితం భర్త నితిన్‌ రాజుకు పాద పూజ చేసిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీనినే భీమన అమావాస్య పూజ అంటారు. పెళ్లి కాని అమ్మాయిలు కూడా మంచి భర్త రావాలని ఈ పూజ చేస్తుంటారు. అయితే సాంప్రదాయాలను ఫాలో అవుతూ అతడి పాదాలకు పూజ చేసిన ప్రణీతను చూసి కొందరు నెటిజన్లు ఇంకా ఏ కాలంలో ఉందో అంటూ వెటకారంగా మాట్లాడారు. ఈ విమర్శలపై తాజాగా ప్రణీత స్పందించింది. ‘జీవితంలో జరిగే ప్రతి విషయానికి రెండు కోణాలుంటాయి. 90 శాతం జనాలు పాజిటివ్‌గా స్పందిస్తారు. మిగిలినవారు నోటికొచ్చినట్లు వాగుతారు, అదంతా నేను పట్టించుకోను. ఒక నటిగా నేను గ్లామర్‌ ఫీల్డ్‌లో ఉన్నంతమాత్రాన సాంప్రదాయాలను, ఆచారాలను ఎందుకు పాటించననుకుంటున్నారు. చిన్నప్పటినుంచి అవన్నీ చూస్తూ పెరిగాను. నా సోదరీమణులు, ఫ్రెండ్స్‌, పక్కింటివాళ్లు ఇలా అందరూ ఈ పూజ చేశారు. పెళ్లైన కొత్తలో గతేడాది కూడా ఈ పూజ చేశాను.`అని చెప్పుకొచ్చారు.

                                              

About Author