పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ప్రేమ !
1 min readపల్లెవెలుగువెబ్ : పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్. ‘నేను దక్షిణాది సినిమాకు పెద్ద అభిమానిని. రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, పవన్‌కల్యాణ్, ప్రభాస్ అంటే చాలా ఇష్టం. పవన్‌కల్యాణ్‌గారంటే విపరీతమైన ప్రేమ. తారక్, రామ్‌చరణ్ నాకు మంచి మిత్రులు’’ అని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం మొదటి భాగం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, అలియాభట్ కీలక పాత్రధారులు. రాజమౌళి సమర్పిస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం విశాఖపట్నంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.