PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ తక్షణమే క్షమాపణ చెప్పాలి

1 min read

– దమ్ముంటే వార్డ్ కార్పొరేటర్ గా గెలుచు పవన్ కళ్యాణ్

– కర్నూలు నగర అధ్యక్షురాలు,25వ వార్డ్ కార్పొరేటర్ సత్యనారాయణమ్మ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  గ్రామాల్లో, వార్డుల్లో ఆత్మీయులకు స్వచ్ఛందంగా సేవలందించే వాలంటీర్లు ను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ సంఘవిద్రోహ శక్తులతో పోల్చడం సరికాదు అన్ని కర్నూలు నగర అధ్యక్షురాలు,25వ వార్డ్ కార్పొరేటర్ సత్యనారాయణమ్మ  అన్నారు.అవ్వతాతలు, అక్క చెల్లెమ్మలు ఆప్యాయంగా పలకరించే వాలంటీర్ సోదర సోదరీమణులకు దురుద్దేశాలను ఆపాదించడం సరికాదు అన్ని అన్నారు. వాలంటీర్లు యువతులు సేవలందిస్తున్నారు. స్వచ్ఛంద సేవలో నిమజ్ఞమైన లక్షలాదిమంది వాలంటీర్లను కించపరుస్తూ వారి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేందుకు, సమాజంలో అలజడులు, శాంతి. భద్రతల సమస్య సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలను మేము తిప్పికొడుతున్నాము అన్ని అన్నారు.గ్రామీణ ప్రజల అవసరాలు వారి అవస్థల గురించి కనీస అవగాహన లేని వారు మొత్తం వ్యవస్థనే అవమానించడం దారుణం. వార్డు మెంబరు కూడాలేని పవన్ కు కేంద్ర నిఘా సంస్థలు రిపోర్టు ఇచ్చాయా? మిస్సింగు, హ్యూమన్ ట్రాఫికింగ్కు పవన్ తేడా తెలుసు కోవాలి. వాలంటీర్లలో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారన్న కనీస అవగాహన లేకుండా వాలంటీర్లవ్యవస్థపై పవన్ చౌకబారు విమర్శలు చేస్తున్నారు అన్ని అన్నారు. రాష్ట్ర ప్రజలకు విశిష్ట సేవలందిస్తున్న. వాలంటీర్లకు పవన్ తక్షణమే క్షమాపణ చెప్పాలి.గౌరవవేతనంతో స్వచ్చందంగా పనిచేస్తున్న వాలంటీర్లను అవమానించడం పవన్ దిగుజారుడు తనానికి నిదర్శనం. వాలంటీర్ల గురించి చెప్పాలంటే సేవా మూర్తులు, సంక్షేమ సారధులు. కోవిడ్ వేళ మానవతామూర్తులుగా నిలిచిన వాలంటీర్ల సేవలను ప్రధాని సైతం అభినందించారు. ఇకనైనా పవన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. పవన్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుని వాలంటీర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. వాలెంటీర్ మనోధైర్యాన్ని దెబ్బతీసేలా తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ పై యాక్షన్, చర్యలు తీసుకోవాలని అన్నారు.

About Author