వడ్డేశ్వరం వద్ద `పార` పట్టిన పవన్ కళ్యాణ్
1 min read
పల్లెవెలుగు వెబ్:గుంటూరు జిల్లా వడ్డేశ్వరం వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా గుంతలు పడిన రోడ్లకు జనసేనాధిపతి మరమ్మతులు చేశారు. పార, గమేళా చేతబట్టి స్వయంగా మట్టిని పోశారు. కార్యక్రమం ప్రారంభంలో ఒక్కసారిగా అభిమానులు తోసుకురావడంతో స్థానిక జనసేన నాయకులు కిందపడిపోయారు. దీంతో ప్రశాంతంగా ఉండాలని అభిమానులకు పవన్ కళ్యాణ్ సర్ది చెప్పారు. ఏపీలోని రోడ్ల పరిస్థితి పై నిరసన తెలుపుతూ గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదానం కార్యక్రమం చేపట్టింది.