రైతు మృతి పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
1 min read
పల్లెవెలుగువెబ్ : చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ కార్యాలయంలో పి.రత్నం అనే రైతు మృతి చెందిన ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తిమ్మరాజు కండ్రిగలో అన్యాక్రాంతమైపోతున్న తన భూమిని కాపాడుకునేందుకు పెనుమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష చేస్తున్న రైతు పి.రత్నం ప్రభుత్వ అలసత్వానికి బలైపోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. న్యాయం కోసం దీక్ష చేపట్టిన ఒక సామాన్య రైతు ప్రాణాలు కోల్పోవడం మానవీయతకు మాయని మచ్చగా మిగిలిపోతుందని తెలిపారు.