పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన.. మూడో వంతు స్థానాల్లో పోటీ !
1 min read
పల్లెవెలుగువెబ్ : తెలంగాణలోని యాదాద్రి జిల్లా పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో మూడోవంతు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతీ నియోజకవర్గంలో 5 వేల ఓట్లు ఉన్నాయని తెలిపారు. పవన్ వ్యాఖ్యలతో అభిమానులు, కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన అన్ని వర్గాల వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది త్యాగాలు చేశారన్నారు. సామాజిక మార్పు కోసమే జనసేన అని స్పష్టం చేశారు.