NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ఔరంగ‌జేబు’ కాలం క‌థ‌తో ప‌వ‌న్

1 min read

ప‌వన్ క‌ళ్యాణ్ కొత్త సినిమా టైటిల్, ఫ‌స్ట్ గ్లిమ్స్ శివ‌రాత్రి ప‌ర్వదినం సంద‌ర్భంగా విడుద‌ల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్షన్స్ ప‌తాకం మీద ఏ.ఎమ్. ర‌త్నం తెర‌కెక్కిస్తున్నారు. జాగ‌ర్లమూడి క్రిష్ ద‌ర్శకుడు. ఈ సినిమాలో ప‌వ‌న్ వ‌జ్రాల దొంగ పాత్రలో క‌నిపించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ఔరంగ‌జేబు కాలం నాటి క‌థ‌తో ఈ పీరియాడిక‌ల్ డ్రామాగా సినిమా మ‌న ముందుకు రాబోతోంద‌ని టాక్. అయితే.. ఔరంగ‌జేబుగా బాలివుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్, ఆయ‌న సోద‌రిగా జాక్వ‌లిన్ ఫెర్నాండెజ్ న‌టించ‌బోతున్నారని స‌మాచారం. సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతోంది. పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల చేసేందుకు చిత్రయూనిట్ స‌న్నద్దమ‌వుతోంది.

About Author