పవన్ ఆశయం ఏంటో అభిమానులకు చెప్పాలి !
1 min read
పల్లెవెలుగువెబ్ : వచ్చే ఎన్నికలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఇంకా క్లారిటీ లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పొత్తులపై మూడు ఆప్షన్లు ఉన్నాయని పవన్ కల్యాణ్ చెప్పడాన్ని అంబటి తప్పుబట్టారు. అసలు పవన్ కల్యాణ్‌కు ఇంకా క్లారిటీ లేదని ఆరోపించారు. ‘చంద్రబాబును సీఎం చేయడమే పవన్ ధ్యేయమా?, ఎవరిదో పల్లకి మోయడానికి ఆప్షన్లు ఎందుకు?, తన ఆశయం ఏంటో అభిమానులకైనా పవన్ చెప్పాలి? బీజేపీతో పవన్ ఉన్నాడా.. లేడా? అని అంబటి ప్రశ్నించారు. కనీసం అభిమానులకైనా పవన్ ఆశయం ఏమిటో చెబితే బాగుంటుందని అంబటి ఎద్దేవా చేశారు.