PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌వితేజ సినిమాలో ప‌వ‌న్ భార్య !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ర‌వితేజ హీరోగా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రూపొందుతోంది. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. కొంతకాలం క్రితం ఇటు ప్రజలకు .. అటు పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేసిన స్టూవర్టుపురం గజదొంగ కథ ఇది. ఈ సినిమాతో తెలుగు తెరకి నుపూర్ సనన్ కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను రేణు దేశాయ్ పోషిస్తున్నారు. తాజాగా ఆమె పాత్రకి సంబంధించిన లుక్ ను .. వీడియో క్లిప్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె ‘హేమలత లవణం’ పాత్రలో కనిపిస్తారనీ .. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పారు. 18 సంవత్సరాల తరువాత ఆమె చేస్తున్న సినిమా ఇది అంటూ మరింత ఆసక్తిని పెంచారు.

                                           

About Author