PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్  ఆడుదాం ఆంధ్ర కాదు రైతుల కష్టాలు పట్టించుకోండి

1 min read

మాలపల్లి గ్రామంలో రైతులకు సాగునీరు విడుదల చేస్తాం, మోటర్లు రిపేరు అని నాలుగు నుండి ఐదు లక్షలు వైసిపి నాయకులు వసూలు చేసి రైతులకు సాగునీరు అందించకపోవడం దారుణం

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కాదు కష్టాల్లో ఉన్న రైతులను పట్టించుకోండని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని మాలపల్లి గ్రామ సమీపంలో వర్షాలు సరిగా లేక సాగునీరు అందక పంటలు ఎండిపోయిన పొలాలను రైతుసంఘం అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, చావిడి వెంకటేష్ అధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే కాని అధికారులు కానీ ఎలాంటి సహాయం చేయకపోవడంతో రైతులు సొంత డబ్బుతో నీళ్ల వాటర్ ట్యాంకుల ద్వారా పంట పొలాలకు నీరు కడుతుండడంతో బాధకరం అన్నారు.  రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు అన్నదాత పథకం కింద 20 వేల రూపాయలు సహాయం చేస్తాం అన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు ఇంత కష్టంలో ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యే బాలనాగ రెడ్డి గానీ, అధికారులు గానీ పట్టించుకోకపోవడం చాలా దారుణమని అన్నారు. రైతే దేశానికి వెన్నెముకని అలాంటి రైతును నిర్లక్ష్యం చేస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.   వైసిపి నాయకులు రైతులతో నాలుగు నుండి ఐదు లక్షలు వసూలుచేసి మీకు నీళ్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు నీళ్లు విడుదల చేయకుండా మోసం చేశారని విమర్శించారు. మాది రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసిపి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మీ నాయకులు రైతులతో సాగునీటి కూడా డబ్బులు వసూలు చేస్తుంటే మిమ్మల్ని ఏమనాలో అర్థం కావడం లేదు అన్నారు. ఎత్తిపోతల పథకం సంబంధించిన మోటర్లు చెడిపోతే కనీసం మరమ్మతులు చేయించకుండా నిర్లక్ష్యం చేయడం రైతు ద్రోహి ప్రభుత్వం గా నిలిచిపోతుందని అన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని , అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులకు 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో పెద్ద కడుబూరు మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న,తెలుగు రైతు జిల్లా కార్యదర్శి యల్లారెడ్డి , గోపాల్ రెడ్డి, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి,మాలపల్లి చంద్ర,భీమన్న ఆచారి, నరసన్న ఆచారి,వగరూరు అబ్దుల్ ,పవన్ కుమార్ రెడ్డి, బండ్రాల నరసింహులు, కేశన్న ,రోగప్ప, చౌటుపల్లి వీరేశ్, ఆంజనేయులు, శ్రీనివాస్,ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బొగ్గుల నరసన్న, జనసేన నాయకులు ఏసేపు తదితరులు పాల్గొన్నారు.

About Author