NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బిల్లులు వెంటనే చెల్లించండి : ఆప్టా

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాద్యాయులు, పెన్సనర్స్లకు అందాల్సిన వివిద రకాల ఆర్థిక బిల్లులు సి.ఎఫ్.యమ్.ఎస్ వద్ద నెలలు తరబడి పెండింగ్​లో ఉన్నాయని, వెంటనే చెల్లించాలని సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డిని కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరావు,ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా విపత్కర పరిస్థితులలో కూడా ఉద్యోగులు సంక్షేమ పధకాలు ప్రజల వద్దకు చేర్చారని గుర్తు చేశారు. మండల పరిషత్, జిల్లాపరిషత్ ఎన్నికల్లో కూడ ఓటర్లు స్వేచ్చగా ఓటువేసుకోనేటట్లు , ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహాకరించి ప్రభుత్వం మన్నలను పొందారన్నారు. ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ విధంగా ప్రభుత్వం నకు సహకరించి, అభివృద్ధి లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు ఆర్ధిక అంశాలు నెలల తరబడి అపరిష్కృతంగా ఉండుటం వలన ఉద్యోగుల ,ఉపాధ్యాయులు మానసిక స్దైర్యం దెబ్బ తింటుందనీ వారు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఇబ్బందుల దృష్ట్యా సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి స్పందించి వెంటనే సీఎఫ్​ఎంఎస్​ వద్ద ఉన్న పెండింగ్​ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గణపతి రావు, ప్రకాశ్​రావు విజ్ఞప్తి చేశారు.

About Author