NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి గింజ‌కూ డ‌బ్బు చెల్లించండి : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఏపీలో రైతు నుంచి సేక‌రించిన ధాన్యం లెక్కల‌ను, వివ‌రాలను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతోంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రశ్నించారు. ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి ఈ వివ‌రాలను ఎందుకు తొల‌గించారో స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ప‌వ‌న్ కళ్యాణ్ ఓ ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. రైతుల‌కు ధాన్యం డ‌బ్బులు చెల్లించ‌డంలో ప్రభుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న ఆరోపించారు. నెల‌ఖారులోగా ప్రతి గింజ‌కూ డ‌బ్బు చెల్లించాల‌ని .. లేనిప‌క్షంలో రైతుల కోసం పోరాడ‌తామ‌ని హెచ్చరించారు. రైతు నుంచి ధాన్యం సేక‌రించి నెలలు గ‌డుస్తున్నా డ‌బ్బు ఎందుకు చెల్లించ‌లేద‌ని నిల‌దీశారు. రైతుల‌కు ప్రభుత్వం 3వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు బ‌కాయిలు ప‌డిందన్నారు. ఒక్క ఉభ‌య‌గోదారి జిల్లాల్లోనే రూ.1800 కోట్లు చెల్లించాల‌ని తెలిపారు.

About Author