పెండింగ్ బకాయిలు చెల్లించండి.. పి ఆర్ సి కమిటీ ఏర్పాటు చేయండి – ఆప్టా
1 min read
న్యూస్ నేడు అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటి పోయింది. కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలి మరియు వెంటనే పి ఆర్ సి కమిటీ ఏర్పాటు చేసి మధ్యంతర భృతి ను ప్రకటించాలని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఎ జి ఎస్ గణపతి రావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి లేఖ ద్వారా ప్రాతినిధ్యం చేశారు. ప్రస్తుతం రాష్ట్రము లో ఉన్న ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన కరువు భత్యం సుమారు నాలుగు పాత బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి వాటిలో కొన్నిటిని ఐన మంజూరు చేయవలసిన అవసరం ఉంది అని ఆప్తా నాయకులు కోరారు.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరియు కొత్త ప్రభుత్వం వెసులుబాటు కొరకు ఉద్యోగ మరియు ఉపాధ్యాయ సంఘాలు మౌనంగా ఉన్నాయి, కాలం గడిచి పోయే కొద్ది ఉద్యోగ మరియు ఉపాధ్యాయులలో అసహనం పెరిగి పోతుంది. అది ఉద్యమ బాట పట్టే లోగా న్యాయంగా ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు చెల్లించ వలసిన పాత పి ఆర్ సి బకాయిలు,సుమారు మూడు సంవత్సరాల కాలం నుండి చెల్లించ వలసిన సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలి అని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) నాయకులు కోరారు. గత ప్రభుత్వం లో నియమించ బడిన పి ఆర్ సి చైర్మన్ రాజీనామా చేశారు. ఆ స్థానంలో కొత్త చైర్మన్ ను నియమించి పి ఆర్ సి ని ముందుకు నడిపించ వలసిన అవసరం ఉందని ఆ దిశ గా చర్యలు తీసుకోవాలని గొరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్య మంత్రి శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ గారికి లేఖ ద్వారా ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్( ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు ఎ జి ఎస్ గణపతి రావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు డిమాండ్ చేశారు.