PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

MNO,FNO లకు పెండింగ్ వేతనం చెల్లించండి : AITUC

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచెస్తున్న MNO, FNO లకు పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలని…జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో DMHO రామ గిడ్డయ్యను AITUC నగర కార్యదర్శి రామకృష్ణ రెడ్డి కోరారు. బుధవారం డీఎంహెచ్​ఓ కార్యాలయంలో ఎంఎన్​ఓ, ఎఫ్​ఎన్​ఓలు డీఎంహెచ్​ఓ రామగిడ్డయ్యను కలిశారు జిల్లా లో ఉన్న PHC లలో APCOS ద్వారా గత సంవత్సరం అక్టోబర్ లో నియమితులైన MNO FNO లకు ఇంతవరకు ఒక్క నెల వేతనం కూడా అందలేదన DMHO దృష్టి కి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా AITUC నగర కార్యదర్శి రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ MNO FNO లకు పెండింగ్ లో ఉన్న 10 వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, .ఇటీవల APCOS నుండి పరిమిషన్ వచ్చినప్పటి కేవలం జూలై వేతనం మాత్రమే APCOS వెబ్సైట్ లో ఆప్ లోడ్ చేసారని..అది కూడా ఇంతవరకు చేతికి రాలేదన్నారు. .మిగతా 9 నెలల వేతనాల గురించి PHC లలో అడిగితే APCOS నుండి మల్లి పరిమీషన్ రావాలని CFMS ID రావాలని చెబుతున్నారని రామకృష్ణ రెడ్డి DMHOదృష్టికి తీసుకువచ్చారు..నంద్యాల DCH పరిధిలో పనిచేస్తున్న MNO FNO లకు ఇటీవల 5 నెలల వేతనాలు అందాయని DMHO పరిధిలో మాత్రం ఒక్క నెల కూడా చేతికి అందకపోవడం ఏమిటని ప్రశ్నించారు. .అదేవిధంగా కరోన కష్టకాలంలో వైద్య సేవలు అందించిన MNO, FNO సాఫ్ట్ నర్సులకు పెండింగ్ లో ఉన్న 9 నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలి అయన డిమాండ్ చేసారు లెనీ పక్షంలో AITUC ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అయన అన్నారు.. డీఎంహెచ్​ఓను కలిసిన వారిలో శివ ప్రసాద్, రామదాస్, నాగరాజు, నాగమణి ,నవీన్ తదితరులు ఉన్నారు.

About Author