‘హౌసింగ్ గ్రౌండింగ్’ పై ప్రత్యేక దృష్టి సారించండి
1 min read– ఆదోని ఎమ్మార్వో రామకృష్ణ
పల్లెవెలుగు వెబ్, ఆదోని: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు – పేదలందరికీ ఇల్లులో భాగంగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని ఆదోని తహసీల్దార్ రామకృష్ణ పిలుపునిచ్చారు. హౌసింగ్ గ్రౌండింగ్ మేళాను వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో హౌసింగ్ స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, ఎం.పి.డి.వో గీతావాణి, పంచాయితీ రాజ్ ఏ.ఈ మాలిక్, ఏ.పి.యం జనార్థన్, అగ్రికల్చర్ ఏ.వో పాపి రెడ్డి, రెవెన్యూ, సచివాలయం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హౌసింగ్ స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆదోని మండలం వ్యాప్తంగా మొదటిదశలో 2,788 ఇల్లు మంజూరు కాగా జూలై 1వ తేదీన 930, 3న 929, 4న 929 చొప్పున మొత్తం 2 వేల 2,788 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు. గృహ నిర్మాణాలకు ఆయా గ్రామాల వారీగా లబ్ధిదారులను సమాయత్తం చేయడంతో పాటు ఇందుకు అవసరమైన ఇసుక, ఇటుకలు, సిమెంటు సరఫరా తదితర గృహ నిర్మాణానికి సంబంధించి సామాగ్రి పై దృష్టిసారించాలని సంబంధిత అధికారులను స్పెషల్ ఆఫీసర్ ఆదేశించారు.