పేటీఎం బ్యాన్.. ఎందుకంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ గట్టిషాక్‌ను ఇచ్చింది. బ్యాంక్‌లో కొన్ని పర్యవేక్షణ లోపాలను గుర్తించడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకు విదేశాల్లోని సర్వర్‌లకు డేటాను అనుమతించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించినట్లు బ్లూమ్‌బెర్గ్ ఒక నివేదికలో పేర్కొంది. చైనా ఆధారిత సంస్థలతో కంపెనీ సర్వర్లు సమాచారం పంచుకుంటున్నాయని ఆర్బీఐ వార్షిక తనిఖీల్లో గుర్తించాయని నివేదికలో వెల్లడించింది. అందుకే పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై నిషేధం విధించినట్లు బ్లూమ్‌బెర్గ్ అభిప్రాయపడింది. బ్లూమ్‌బెర్గ్ నివేదికను పేటీఎం తీవ్రంగా ఖండించింది.అవన్నీ పూర్తిగా తప్పుడు ఆరోపణలంటూ పేర్కొంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సంబంధించిన డేటాను ఎవరితో పంచుకోలేదని వెల్లడించింది. డేటా స్థానికీకరణపై ఆర్బీఐ ఆదేశాలను పేటీఎం పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొంది.