NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందేంచేందుకే పి.సి.వి వ్యాక్సినేషన్

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి/వీరబల్లి: చిన్నపిల్లలలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందేంచేందుకే పిసివి వ్యాక్సినేషన్ అని సర్పంచ్ సోమారపు నాగార్జున చారి పేర్కొన్నారు . వీరబల్లి మండలం మట్లి గ్రామంలో ఏఎన్ఎం, సచివాలయ సిబ్బందితో కలిసి చిన్నపిల్లల లకు పిసివి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ వల్ల పిల్లల్లో బ్యాక్టీరియాను నివారించి రోగనిరోధకశక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడతాయన్నారు. చిన్న వయసులోనే పిల్లల పట్ల ఆరోగ్యంగా ఉండేందుకు పిల్లలు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటిస్తూ వైద్యులు సూచనల మేరకు వ్యాక్సిన్ లు వేయించుకోవలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం జ్యోతి ప్రియదర్శిని, ఆశావర్కర్లు చంద్రకళ, రాజేశ్వరి, మహిళా కానిస్టేబుల్ సాయి రమ్య తో పాటు గ్రామస్తులు రమణయ్య, అంజి తదితరులు పాల్గొన్నారు.

About Author