నేరస్తుడిపై పిడి యాక్ట్….
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది మండలం బుచ్చమ్మ తోటకు చెందిన పలు కేసుల్లో నేరస్తుడైన నల్లబోతుల నాగప్ప @ రాజు @ శివారెడ్డి అనే వ్యక్తిపై పి డి యక్ట్ నమోదు చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే 12 కేసుల్లో శిక్ష పడిందని జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మార్పు రాలేదన్నారు. కడప అనంతపురం కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో జరిగిన పలు చోరీల్లో కేసు నమోదులు అయి ఉండడంతో పిడి యాక్ట్ నమోదు చేసి కడప కేంద్ర కారాగరానికి తరలించినట్లు అందులో పేర్కొన్నారు. నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజానీకానికి ఆటంకాలు కలుగ చేస్తూ గుండాయిజం ప్రదర్శిస్తూ ఉండడంతో పి డి యాక్ట్ నమోదు చేశామన్నారు . పీడీ యాక్ట్ నమోదుకు సంబంధించి నంద్యాల జిల్లా కలెక్టర్ కు పంపగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా గుండాయిజం దాదాగిరి హత్య దోపిడీ ఇతర చట్టపరమైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పిడి యాక్ట్ కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.