రామాంజనేయులుపై పీడీ యాక్ట్ కేసు ఎత్తివేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్:కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చేరుకులపాడు గ్రామానికి చెందిన కురువ రామాంజనేయులు పై పెట్టిన పీడీ ఆక్ట్ కేసును ఎత్తివేయాలని అనంతపురం జిల్లా కురువ సంఘం వారు గురువారం కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మద్దతు గా ధర్నా చేపట్టారు .ఈ కార్యక్రమం లో సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు కే .రామచంద్రయ్య మాట్లాడుతూ కురువ రామాంజనేయులు పై పత్తికొండ మ్మెల్యే ప్రమేయం తో వెల్దుర్తి ఎస్ ఐ అక్రమంగా కేసులు నమోదుచేసి పీడీ కేసు పెట్టడం దుర్మరమైన చర్య అని అన్నారు .మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు ,అనంతపురం కురువ యువజన సంఘం నాయకులు బిల్లే మంజునాథ్ ,నారాయణస్వామి కాటమాయ్య కర్నూల్ జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,జిల్లా కోశాధికారి కే .సి .నాగన్న ,నగర అధ్యక్ష ,కార్యదర్శి తవుడు శ్రీనివాసులు ,బి .రామక్తిష్ణ ,పత్తికొండ సురేంద్ర ,బత్తిన లోకనాథ్ ,మదాసి కురువ సంఘం నాయకులు సుంకన్న ,రాయలసీమ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ మోహన్ప్రసాద్ ,కే . దామోదర్ ,కే .రంగస్వామి ,రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు .