ఎన్ఆర్ఈజీఎస్ పనులను తనిఖీ చేసిన పీడీ
1 min read
పల్లెవెలుగు వెబ్, కల్లూరు: కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని చెట్ల మల్లపురం, నాయకల్లు గ్రామాల్లో జరిగిన ఎన్ఆర్ఈజీఎస్ పనులను డ్వామా పీడీ బి. అమర్నాథ్ రెడ్డి మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం జాబ్ కార్డు అప్ డేషన్, హార్టికల్చర్ ఫెడర్ ఛానల్ బోర్డు పరిశీలించారు. నాయకల్లు గ్రామసచివాలయం బిల్డింగ్ మరియు SWM షెడ్ ను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆ తరువాత ఉపాధి కూలీలు, డ్వామా సిబ్బందితో మాట్లాడారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ప్రజలు,NREGS Staff పాల్గొన్నారు.