PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును గెలిపించండి

1 min read

– మండలంలో ముమ్మరంగా ప్రచారం..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోతుల నాగరాజు గారికి మద్దతుగా సిపిఎం పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో బహుజన ఉద్యమ నేత నిరంతరం ప్రజా సమస్యల కోసం రాయలసీమ ప్రాంతం అభివృద్ధి కోసం నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని పోరాటం చేస్తున్న పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు కి 27వ సీరియల్ నెంబర్ కు 1 అంకెను వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గని జిల్లా పరిషత్ హై స్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గ్రామ వార్డు సచివాలయాలు యూనియన్ బ్యాంక్, మంచాలకట్ట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గ్రామ సచివాలయం, గడివేముల మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పోలీస్ స్టేషన్. ప్రభుత్వ కార్యాలయాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు చంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు పెరుగు శివ కృష్ణ జిల్లా నాయకులు రాజేష్ అనిల్ మనోహర్ బాలు నాయుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author