రేషన్ బియ్యం పట్టివేత… ఇద్దరి అరెస్టు
1 min read
పల్లెవెలుగు వెబ్, ఉలిందకొండ: తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా మదనపురం గ్రామానికి చెందిన భార్యభర్తలు కుర్మన్న, పద్మ కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకపల్లి, వామసముద్రం, ఓబులాపురం తదితర గ్రామాలలో ప్రజల నుండి పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో తడకనపల్లె క్రాస్ దగ్గర పట్టుకున్నట్లు ఉలిందకొండ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక్కడి నుంచి తరలించిన బియ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలోని హోటళ్లకు, పందుల దానాకు విక్రయిస్తున్నట్లు కుర్మన్న, పద్మ అంగీకరించారు. వారి వద్ద నుంచి bolero pickup వాహనమును , సుమారు ఒక టన్ను ( 35 పాకెట్స్ , ఒక్కొకటి 30 కేజీలు) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.