ప్రశాంత ఎన్నికలే లక్ష్యం..!
1 min readప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి.
నందికొట్కూరు, ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసు కవాతు.
సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల ప్రత్యేక నిఘా.
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. కె. శ్రీనివాసులు ,
జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఐపీఎస్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. కె. శ్రీనివాసులు పిలుపునిచ్చారు.మంగళవారం ఆత్మకూరు సబ్ డివిజన్ నందికొట్కూర్ టౌన్, ముచ్చమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసు కవాతు నిర్వహించారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి, కేంద్ర సాయుధ పోలీసు అధికారులు సిబ్బంది స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.శ్రీనివాసులు మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని నిష్పక్షపాతంగా, నిర్భయంగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలు, స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి పోలీసు కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకే కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో ప్రజలు వినియోగించుకోవాలన్నారు. నిర్భయముగా భయపక్షపాతాలు లేకుండా ఉండేందుకు పోలీసు వారు ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటారని, ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని, ఎక్కడ ఎలాంటి గొడవలు,అల్లర్లు జరుగకుండా అన్నిచర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని బైండోవర్ చెయ్యడం జరిగిందని, వారిపై ప్రత్యక నిఘా ఉంచడం జరిగిందని తెలిపారు.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. కుల,మత, వర్గాల మధ్య విద్వేషాలకు విభేదాలకు దారి తీసే విధంగా ప్రసంగాలు చేయరాదన్నారు. ఈ పోలీసుకవాతు కార్యక్రమంలో ఆత్మకూరు డిఎస్పి ఏ శ్రీనివాసులు ,నందికొట్కూరు అర్బన్ రూరల్ సీఐ లు ఓ.విజయభాస్కర్ , జి. ప్రకాష్ కుమార్ , ఎస్ఐ లు నాగార్జున, జయ శేఖర్ లు కేంద్ర సాయుధ బలగాల అధికారులు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.