NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెడబల్లి బాల ఎల్లారెడ్డి సేవలు.. స్ఫూర్తిదాయకం

1 min read

ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్. గిరిధర్

పల్లెవెలుగు వెబ్​: కడప జిల్లా చెన్నూరుకు చెందిన స్వాతంత్ర సమర యోధుడు పెడబల్లి బాల ఎల్లారెడ్డి స్వతంత్ర ఉద్యమానికి చేసిన సేవలు స్ఫూర్తిదాయక మని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్( ఎల్ఐసి) కడప. కర్నూల్. అనంతపురం. సీనియర్ డివిజనల్ మేనేజర్ గిరిధర్ కొనియాడారు. ఆజాదీ క అమృత మహోత్సవాల్లో భాగంగా ఎల్ఐసి కడప బ్రాంచ్ వారి తరఫున ఆదివారం ఉదయం చెన్నూరు నాగలకట్ట వీధి లో ఉన్న స్వాతంత్ర సమర యోధుడు. పెడబల్లి బాల ఎల్లారెడ్డి(101) నీ సీనియర్ డివిజనల్ మేనేజర్. గిరిధర్. ఎల్ఐసి మార్కెటింగ్ మేనేజర్. శంకర్ నాయక్. కడప డివిజినల్ ఎల్ ఐ సి ఓ ఎస్ మేనేజర్ .షాహూ కడప ఎల్ఐసి డివిజనల్ మేనేజర్. శ్రీనివాసులు. బ్రాంచ్ మేనేజర్. వెంకట కృష్ణ. ఏబీఎం. విజయ్ కుమార్. ఎల్ఐసి ఉద్యోగ సంఘాల నాయకుడు . రఘునాథ రెడ్డి. లు సమరయోధుడు బాల ఎల్లారెడ్డి ని శాలువా కప్పి పూలమాలలతో సన్మానించడం అలాగే ఎల్ఐసి వారి తరఫున గోల్డ్ మెడల్ తో పాటు దీపికను అందజేశారు. స్వాతంత్ర సమర యోధుడు బాల ఎల్లారెడ్డి తో గత స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించి ఆయనను అడిగి తెలుసుకున్నారు. నూట ఒక్క సంవత్సరం వయసు పైబడటం తో బాల ఎల్లారెడ్డి మాటలను ఆసక్తిగా ఎల్ఐసి అధికారులు విన్నారు. ఈ సందర్భంగా ఎల్ఐసి అధికారులు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కారుని కి తాము సన్మానించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని వారన్నారు. స్వాతంత్ర ఉద్యమ కారుడు బాల ఎల్లారెడ్డి కి తమతో పాటు ఎల్ఐసి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. సన్మాన కార్యక్రమం లో ఎల్ఐసి ఉద్యోగులు. ఎల్ఐసి ఏజెంట్లు. చీర్ల చెన్నయ్య యాదవ్. శ్రీనివాసరాజు. వెంకటేశ్వర్లు. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author