పెద్దమ్మ తల్లి ఆలయానికి.. బోరు మోటరు
1 min read
పల్లెవెలుగు, గడివేముల:భక్తుల పాలిట కొంగుబంగారమై వీరాదిల్లుతున్న శ్రీ మూల పెద్దమ్మ తల్లి ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మంచి నీటి బోరు కు కొత్తపల్లే మండలం దుద్యాల గ్రామానికి చెందిన కీర్తిశేషులు శకుంతలమ్మ గారి జ్ఞాపకార్థం భర్త కొల్లూరు కృష్ణమూర్తి, కుమారులు కొల్లూరు వేణుగోపాల్ శెట్టి,కొల్లూరు శ్రీనివాసగుప్త లు ఆలయ ఈవో మోహన్ , ఆలయ చైర్మన్ చిన్నన్న ,ధర్మకర్తల సమక్షంలో మోటారును అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.దాత మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి గా 35 వేల రూపాయల విలువ చేసే బోరు మోటరు వేయించామని, గతంలో కూడా రెండుసార్లు ఆలయానికి అవసరమైన 30 వేల రూపాయలు విలువ చేసే ఎలక్ట్రికల్ డ్రమ్స్ ఇప్పించామని అన్నారు. మూల పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో ఆలయ అభివృద్ధికి మరింత సహకరిస్తామని ఈ సందర్భంగా దాతలు తెలిపారు.