NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రంలో మైనారిటీలకు పెద్దపీట – డిప్యూటీ సీఎం

1 min read

పల్లెవెలుగువెబ్​, కడప: రాష్ట్రంలో మైనార్టీలకు పెద్దపీట వేయడమే లక్ష్యంగా ‘మైనారిటీ సబ్​ప్లాన్’​కు కేబినెట్ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం అంజాద్​బాష తెలిపారు. కడప నగరంలోని 34వ డివిజన్​ వైసీపీ ఇన్​ఛార్జీ అలిఅక్బర్​ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్​బాష, కడప మేయర్​ సురేష్​బాబులను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ సీఎం వై ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీల అభ్యన్నతి కోసం ప్రణాళికబద్ధంగా ముందుకెళుతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి 4 శాతం ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ముస్లిం మైనార్టీలకు సబ్ ప్లాన్​ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. రాష్ట్ర క్యాబినెట్​లో ఆమోదించినట్లుగా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ తరహాలోనే మైనారిటీలకు కూడా సబ్ ప్లాన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆరిఫుల్లా భాష, మక్బూల్ భాష, రిజ్వాన్, షఫీ,సుర్యానారాయణ *అజ్మతుల్లా, జఫరుల్లా, కో-ఆప్షన్ మెంబర్ లు పత్తి రాజేశ్వరి, జహీర్, వైకాపా నాయకులు అఫ్జల్ ఖాన్, జమాల్ వలి, సుభాన్ భాష, రామచంద్రారెడ్డి, బండారు శివకేశవ, రామ్మోహన్ రెడ్డి, అక్బర్, రఫీ,గౌస్ బాష, పవర్ అల్తాఫ్, కమల్ భాష తదితర వైకాపా నాయకులు పాల్గొన్నారు.


        

About Author