NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైభవంగా పెద్దింట్లమ్మ వారి జాతర మహోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్​ నేతాజీ ప్రతినిధి, ఏలూరు : కైకలూరు మండలం, కొల్లేటికోట గ్రామం లో వేంచేసియున్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానము నందు జాతర ఉత్సవములు పదవ రోజు సందర్భముగా గురువారం ఉదయం గం.5.00 ల నుండి గం. 6:00 ల వరకు శ్రీ పుష్యాహావచనము, శ్రీ విఘ్నేశ్వర పూజ, ఉదయం గం.8:00 ల నుండి గం.11 : 00 వరకు పంచగవ్యం, ధీక్షధారణ, సాయంత్రం గం.5:00 ల నుండి అంకురారోపణ, నవగ్రహ కళాశార్చన, వాస్తుపూజ, సాయంత్రం వాస్తుబలి, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, బలిహరణ, ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ అమ్మవార్లను దర్శించి, పాల పొంగళ్ళు సమర్పించుకుని తమ తమ మ్రొక్కుబడులను చెల్లించుకున్నారు అని తెలిపారు. గురువారం శ్రీ అమ్మవార్లకు వస్త్రాలంకరణ పుష్పాలంకరణ చేసిన దాతలు భుజబలపట్నం వాస్తవ్యులు శ్రీ అల్లూరి జ్ఞానేంద్ర వర్మ శ్రీమతి నాగలక్ష్మీ మరియు శ్రీ అల్లూరి సురేశ్ రాజు శ్రీమతి ఇందు దంపతులకు ఆలయ అర్చకులు విశేష పూజలు జరిపించి శేష వస్త్రములతో వారిని సత్కరించి అనంతరం ప్రసాదం వితరణ చేసినారు అని తెలియజేశారు. గురువారం సాయంత్రం గం.4:00 లకు ఉమ్మడిశెట్టి సత్యవతి బొమ్మినంపాడు వారిచే మురళి కోలాట ప్రదర్శన, సాయంత్రం గం. 6.00 లకు పంచహారతులు మరియు రాత్రి గం.7.00 లకు కలిదిండి వాస్తవ్యులు శ్రీ అంకసాయి శ్రీనివాస నాట్య మండలి బాబూరావు సమర్పణలో త్రీ రత్నాలు నాటక సీనులు ప్రదర్శన కార్యక్రమం జరుగునని ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి. గోపాలరావు ఒక ప్రకటనలో తెలియచేసినారు.

About Author