NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెద్దూరు కస్పాలో.. చంద్రన్న రంజాన్​ తోఫా పంపిణీ

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి /వీరబల్లి: రంజాన్ పండుగ సంధర్భంగా టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వీరబల్లి మండల కేంద్రంలోని దిగువరాచపల్లె పంచాయితీలోని వంగిమళ్ళ పెద్దూరు కస్పాలోని నిరుపేద ముస్లిం, మైనారిటీ కుటుంబాలకు సోమవారం టిడిపి జిల్లా నాయకులు చమర్తి జగన్మోహన్ రాజు సహాయ సహకారంతో చంద్రన్న రంజాన్ తోఫా ను టిడిపి గ్రామ నాయకులు పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసిన ఘనత ఒక్క టిడిపి కే దక్కుతుందన్నారు. జగన్ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీల కు తీవ్ర అన్యాయం జరుగుతోందని  పేద ప్రజలు పండుగలు జరుపుకోవాలంటే ప్రజలు భయపడుతున్నారని ఏ ఒక్క నిత్యావసర వస్తువు కొనాలన్నా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆరోపించారు. టిడిపి హయాంలో ముస్లిం మైనారిటీల కోసం ఎన్నో సంక్షేమ పథకాల ను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు కే దక్కుతుందన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఉంటే ప్రతి ఏటా చంద్రన్న రంజాన్ తోఫా ను ప్రతి ఒక్కరికి అందజేసేవారని అన్నారు. మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి తీసుకొస్తే గతంలో ఇచ్చిన విధంగా ప్రతి ఏటా చంద్రన్న రంజాన్ తోఫా తోపాటు జగన్ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలన్నీ యథావిధిగా కొనసాగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ నాయకులు పద్మరాజు ప్రసాద్ రాజు, మైనారిటీ సెల్ మండల నాయకులు షేక్ సలీం, భాషు, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి తోళ్ళ సురేంద్ర, టిడిపి మహిళా అధ్యక్షురాలు నాగసుబ్బమ్మ, బీసీ నాయకులు వండాడి సుబ్బరాయుడు, రామాంజులు, ఎస్సీ నాయకులు నయం యల్లయ్య, తెలుగుయువత నాయకులు నయం కదరయ్య, రెడ్డెయ్య, తదితరులు పాల్గొన్నారు.

About Author