పెగాసస్ ఎఫెక్ట్.. విపక్షాల అల్పాహార సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ : పెగాసస్ స్పైవేర్ నిఘా పై విపక్షాలు ఒక్కటయ్యాయి. ఈ వ్యవహారంలో పార్లమెంట్ లో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ప్రతిపక్షాల అల్పాహార విందు సమావేశం కొనసాగుతోంది. టీఎంసీ, సమాజ్ వాదీ, శివసేన, ఆర్జేడీ సహా 14 ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా ప్రశ్నించేలా వ్యూహాన్ని రచిస్తున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా బయటకు వచ్చి మాక్ పార్లమెంట్ నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ఒక్క రోజు ముందు పెగాసస్ వ్యవహారం బయటికి వచ్చింది. దీంతో ఈ వ్యవహారం పై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ వ్యవహారం పై నిరసనలతో ఉభయ సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భేటీకి ప్రాధాన్యత నెలకొంది.