దేశంలోని యువత ఫోన్లపై ‘ పెగాసస్ ’ నిఘా !
1 min readపల్లెవెలుగు వెబ్ : దేశంలోని యువతీ, యువకుల ఫోన్లపై ‘పెగాసస్’ నిఘా వేసిందని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. యువత గొంతు నొక్కేందుకు పెగాసస్ స్పైవేర్ ఫోన్లలో అమర్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ ప్రధానిగా కొనసాగినంత కాలం యువతకు ఉద్యోగాలు రావని, ఉపాధి దొరకదని రాహుల్ ధ్వజమెత్తారు. ప్రధాని బడా పారిశ్రామికవేత్తలతో స్నేహం చేస్తున్నారని, యువతకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. పెగసస్ అంశం చిన్నదని కేంద్రం కొట్టిపారేయడం పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు మాట్లాడకుండా కట్టడి చేయాలన్న కుతంత్రంతో ఫోన్లలో స్పై వేర్ పెట్టారని ఆరోపించారు. దేశంలోని ఇద్దరు, ముగ్గురు పారిశ్రామిక వేత్తల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని రాహుల్ విమర్శించారు.